Miss World : అందాల పోటీల ఫైనల్‌కి కౌంట్‌డౌన్

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలకు కౌంట్‌డౌన్ (Countdown) మొదలైంది. క్వార్టర్ ఫైనల్ (Quarter final)కు చేరిన 40 మంది అందాలభామలు ఫైనల్‌లో ప్రపంచ సుందరీ కిరీటం కోసం పోటీపడతారు. ఇప్పటివరకు స్పోర్ట్స్ ఛాలెంజ్‌లో ఒకరు, టాలెంట్ ఛాలెంజ్‌లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో నలుగురు, టాప్ మోడల్ పోటీల్లో నలుగురు, బ్యూటీ విత్ ఏ పర్సస్ విభాగం నుంచి నలుగురు.. మొత్తం 14 మంది విజేతలై ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్‌కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా-కరేబియన్ (America-Caribbean) , ఆఫ్రికా, యూరప్ (Europe) , ఆసియా-ఓషియానా ఖండాల వారీగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇండోనేసియా, వేల్స్ భామలు రెండు పోటీల్లో విజేతులుగా నిలిచారు. టాప్ -40లో ఇప్పటి వరకు 12 బెర్త్‌లు మాత్రమే ఖరారయ్యాయి. అంటే ఇంకా 28 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి పది మంది ఉండేలా ఎంపిక చేస్తారు. ఆ తర్వాతి రౌండ్‌లో వీరిలోంచి టాప్ 20ని తీసుకుంటారు. ఒక్కొక్క ఖండం నుంచి ఐదుగురు ఉంటారు. ఇక అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి ఇద్దర్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరే అంటే నలుగురు అంతిమంగా కిరీటం కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా, మిగిలిన ముగ్గురి ఒకటి, రెండు, మూడో రన్నరప్‌గా నిలుస్తారు.