Miss World : మిస్ వరల్డ్ టాప్ 40లో … నలుగురు భామలకు చోటు

మిస్ వరల్డ్ (Miss World) 2025 పోటీలు ఆఖరి ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోన నే ఉత్కంఠ పెరుగుతోంది. హైటెక్స్ (Hitex) వేదికగా శనివారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ట్రైటెండ్ హోటల్, హైటెక్స్‌లో రిహార్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ (Multimedia Challenge) లో ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ (Miss World Organization) విజేతలుగా ప్రకటించింది. అమెరికన్-కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరాడెల్గాడోబ్ (Myradelgadobe), ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ప్రిన్సెస్సీ (Princess), యూరోప్ నుంచి మోంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఆసియా ఓసియానా నుంచి థాయ్‌లాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ నలుగురు మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్ (టాప్40) జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్‌ట్రాకాలో ఇప్పటివరకు 16 మంది భామలకు చోటు దక్కగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు.