Uttam Kumar Reddy: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండురోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగమార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు, ఎక్కడ టన్నెల్ (Tunnel) ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకొచ్చి వారి సాయం తీసుకుంటున్నామని తెలిపారు.
సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాం. గ్యాస్ కట్టర్ (Gas cutter )తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ (SLBC) పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించాం. ప్రకృతి విపత్తునును రాజకీయం చేసి లబ్ధిపొందాలనుకునే వారి గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ ఎక్స్‌పర్ట్స్ సూచనలతో ముందుకెళ్తున్నాం. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే మా లక్ష్యం అని తెలిపారు.