AI City : ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీ (AI City) లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా-క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) కోరారు. క్వీన్స్‌లాండ్(Queensland) రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య మంత్రి రాస్ బేట్స్(Ross Bates) ఆధ్వర్యంలోని బృందం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి శ్రీధర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సంద్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ-క్వీన్స్‌లాండ్ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ (Life Sciences University )గురించి ప్రత్యేకంగా వివరించాం. జీవ విజ్ఞానం, ఔషధ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ(Telangana)తో కలిసి పని చేసేందుకు ప్రతినిధుల బృందం ఆసక్తి కనబర్చింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న క్రీడా వర్సిటీకి సహకరించడానికి అంగీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య, ఆర్‌అండ్‌డీ, వ్యవసాయం తదితర అంశాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు.