Sridharbabu :పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో షైవా గ్రూప్ భాగస్వామిగా మారిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) అన్నారు. షైవా గ్రూప్ (Shaiva Group), టారానిస్ క్యాపిటల్(Taranis Capital) కలిపి రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బయోసైన్స్ (Bioscience), కృత్రిమ మేధలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమన్నా రు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాదిన్నరలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఏడాదిన్నరలో రూ.3 లక్షలకు కోట్లకు పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారన్నారు. యువత మన ఆస్తి, వారిలో నైపుణ్యాలు నింపేందుకు స్కిల్ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రం అవకాశాల గని, ఆవిష్కరణలకు, అవకాశాలకు, ప్రతిభకు కేంద్రమని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వాములను రాష్ట్రం ఆకర్షిస్తోందన్నారు.