Sridhar Babu-Chandrababu: ఏపీ సీక్రెట్స్ ను బయటపెట్టిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు..!

దావోస్ (Davos) లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic forum) సదస్సుకు భారత్ నుంచి పలు రాష్ట్రాలు హాజరయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ ముందు నిలిచాయి. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాయి. పలు కంపెనీలతో ఒప్పందాలు (Deals) చేసుకున్నాయి. కానీ ఎన్నో ఆశలతో దావోస్ లో అడుగు పెట్టిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాత్రం ఒక్క ఒప్పందాన్ని కూడా చేసుకోకుండా తిరుగుముఖం పట్టింది. దీనిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి వెళ్లింది ఇందుకేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలేవీ చేసుకోలేదనే వార్తలను తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu) ఖండించారు. ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుందని.. అయితే వాటిని బయటపెట్టలేదని చెప్పారు. ఇదే విషయాన్ని తాను ఏపీ మంత్రి లోకేశ్ (Nara Lokesh) ను అడిగానని.. రాష్ట్రానికి వెళ్లిన తర్వాత అక్కడే ఈ విషయాలన్నింటిని బయటపెడాతమని చెప్పారని శ్రీధర్ బాబు వివరించారు. దీన్ని బట్టి వాళ్లు వ్యూహాత్మకంగానే ఒప్పందాలను వెల్లడించేలదేని తనకు అర్థమైందన్నారు. శ్రీధర్ బాబు కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు (Chandrababu) అండ్ టీం కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్లిందని.. అయితే అక్కడ ఒప్పందాలేవీ లేకుండాని తిరిగి వచ్చేసిందనే విమర్శలకు శ్రీధర్ బాబు కామెంట్స్ తర్వాత చెక్ పడింది.
దావోస్ లో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ గురించి కూడా శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆయన చాలా వ్యూహాత్మకంగా దావోస్ లో అడుగు పెట్టినట్లు తమకు అర్థమైందన్నారు. చంద్రాబబు చాలా బ్రాడ్ థింకింగ్ తో ఉన్నారని… పెట్టుబడులను (investments) ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నించిన తీరు అల్టిమేట్ అని వివరించారు. చంద్రబాబు ప్రయత్నాలు సఫలమైతే ఇప్పుడు తెలంగాణను పొగిడిన వాళ్లంతా రేపు తక్కువ చేసి చూపిస్తారని చెప్పుకొచ్చారు. పైగా హైదరాబాద్ (Hyderabad) ను డిస్టర్బ్ చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. భాగ్యనగరం ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారని శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయన్నారు.
ఇక దావోస్ లో గడ్డకట్టించే చలిలో తామంతా స్వెట్టర్లు వేసుకుంటే చంద్రబాబు మాత్రం తన రెగ్యులర్ డ్రెస్ లో ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన చాలా ఫిట్ గా ఉన్నారన్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన అంత యాక్టివ్ గా ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాల వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుందన్నారు. గతంలో ప్రభుత్వాలన్నీ ఈ పని చేశాయన్నారు. మన్మోహన్ వారసత్వాన్ని మోదీ కొనసాగిస్తున్నారన్నారు. ఒక్క జగన్ మాత్రమే అలా అమలు చేయలేదన్నారు శ్రీధర్ బాబు. ఓవరాల్ గా శ్రీధర్ బాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏపీ ఒప్పందాలు చేసుకున్నా వాటిని వ్యూహాత్మకంగానే బయటపెట్టలేదని శ్రీధర్ బాబు కామెంట్స్ ద్వారా అర్థమైంది.