తెలంగాణలో భారీ పెట్టుబడి.. అమెరికాలోని స్ఫియర్ సెంటర్ మాదిరిగా

అమెరికాలోని లాస్ వేగాస్‌లో ప్రసిద్ధి చెందిన స్పియర్ సెంటర్ మాదిరిగా హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచే అత్యంత భారీ పర్యాటక కేంద్రా (తెలంగాణ ఫ్యూచరిస్టిక్ ఎక్స్ పీరియన్స్ సెంటర్) న్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.500 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు నిబంధనల ప్రకారం రాయితీలిచ్చి ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణ ప్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాధాన్యాంశంగా పరిశీలిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దీని ఆవిష్కరణకు ఖర్చయ్యే రూ.500 కోట్ల నిధులను సమకూర్చేందుకు ఏదైనా వాణిజ్య సంస్థ ముందుకొస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ప్రభుత్వపరంగా నిధుల సమీకరణను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
సచివాలయంలో ప్యూచరిస్టిక్ కేంద్రంపై కొందరు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ప్రజంటేషన్‌ను మంత్రి ఆసక్తిగా తిలకించారు. భారీ మాల్ తరహాలో ఉండే ఈ ప్రదేశంలో సమావేశ మందిరాలు, సినిమా ప్రదర్శనల ఏర్పాట్లతో పాటు తెలంగాణ ఘనచరిత్ర, సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు గమ్యాల గురించి అవగాహన కల్పించే విభాగాలు ఉంటాయని శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. పర్యాటకులకు కూడా ఈ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు.