Minister Seethakka: బీసీల హక్కుల కోసం పోరాడుతుంటే రాహుల్ గాంధీపై విమర్శలా?: సీతక్క

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహించి, జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అందించాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని ఆమె చెప్పారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్ది, వారికి న్యాయం చేకూర్చాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ కులగణన కోసం పట్టుబడుతున్నారని సీతక్క వివరించారు. బీసీల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆమె (Minister Seethakka) నొక్కి చెప్పారు. ఇలాంటి కీలకమైన కులగణన అంశాన్ని పక్కన పెట్టేసి, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని సీతక్క (Minister Seethakka) తీవ్రంగా విమర్శించారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఒక విజన్ ఉన్న నాయకుడని, 30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవులను కోరుకోకుండా, దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆమె (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రాహుల్ గాంధీని అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.