ప్రభుత్వం చేస్తున్న పనిపై రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రజలు హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై మంత్రి స్పందించారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆక్రమణకు గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. వాతావరణ కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెరువులపై ప్రభుత్వ లెక్కలు, రికార్డులు మేరకు కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జల వనరులను పరిక్షించుకోవాలి. చెరువుల రక్షణపై ప్రభుత్వం దృష్టికి స్థానికులే తేవాలి. ప్రభుత్వం ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వం చేస్తున్న పనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని మంత్రి తెలిపారు.






