Minister Ponnam : ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు : మంత్రి పొన్నం
తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. కరీంనగర్ (Karimnagar)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతులకు జవాబు చెప్పాల్సిన బాద్యత బండి సంజయ్‌పై ఉంది. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి భారత రాష్ట్ర సమితి నేతలు రాక్షసానందం పొందుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60 శాతం మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది. అందువల్లే కొంత ఇబ్బంది కలుగుతోంది. రాష్ట్రం నుంచి ఏదైనా సమస్య వస్తే బాధ్యత వహించడానికి మేం సిద్ధంగా ఉన్నా అని అన్నారు.







