Ponguleti : ఎంతటి వారైనా తప్పు చేస్తే .. చర్యలు తప్పవు : మంత్రి పొంగులేటి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం (Kaleshwaram), ధరణి, మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకాలు పెద్ద స్కామ్ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. ములుగు (Mulugu)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని ధ్వజమెత్తారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని, ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.






