ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
లైఫై సైన్సెస్ సెక్టార్లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధ రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మా స్యూటికల్స్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింంగ్ కంపెనీ ఏర్పాటుందన్నారు. టీఎన్ఐఐసీ బయోటెక్ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడిరచారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు.






