Komatireddy : బీఆర్‌ఎస్‌లో చీలక ఏమీ లేదు.. ఇదంతా ఓ డ్రామా : కోమటిరెడ్డి

బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy ) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)రాసినట్లు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు. ఆ లేఖ ఓ జోక్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ రాసే లేఖ ఓ పద్ధతిగా ఉందా? ఆ లేఖను సృష్టించాల్సిన అవసరం మాకేంటి? బీఆర్‌ఎస్ (BRS)లో చీలక ఏమీ లేదు, ఇదంతా ఓ డ్రామా. దానిలో భాగమే ఈ లేఖ. తండ్రికి లేఖ రాయాల్సిన అవసరమేంటి? ఆమె నేరుగా చెప్పొచ్చు కదా. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా? వారు గొడవపడరు. ఒకవేళ అలా జరిగితే అది ఆస్తుల గురించే అవుతుంది అని అన్నారు.