Meenakshi Natarajan : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్ లోక్‌సభ స్థానం నుంచి 2009-14 మధ్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) బృందంలో ముఖ్య సభ్యురాలిగా గుర్తింపు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు ఠాక్రే (Manikrao Thackeray) ఉండగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దీపా దాస్ మున్షీ (Deepa Das Munshi )ని నియమించారు. తాజాగా మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఆదేశాలు జారీ చేశారు.