తెలంగాణలో ప్రారంభం కానున్న మరో భారీ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలో భారీ సంస్థ ప్రారంభం కాబోతుంది. భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేటు కోచ్ ఫ్యాక్టర్లీలో ఒకటైన మేథా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండటం గర్వకారణమని పరిశ్రమలు, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటైన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండటం గర్వకారణమన్నారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమి పూజా చేశారు. భూమి పూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణం పనులు మేధా సంస్థ వేగంగా పూర్తి చేసుకుంది. సుమారు రూ.800 కోట్లతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశం లభించనున్నాయి. రైల్ కోచ్లు, మెట్రో కోచ్లు ఇక్కడ తయారు చేయనున్నారు.






