Raghunandan Rao:వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:రఘునందన్
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. మెదక్‌లోని జీకేఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులను పరామర్శించారు. ఆనంతరం రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ పోచారం (Pocharam )లో నిన్న ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) , ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు గాలిస్తున్నాయి. మెదక్జిల్లాలో పునరుద్దరణ పనుల కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ (Minister Vivek) రూ.కోటి వరద సాయం ప్రకటించారు. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల సబ్‌స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. ఆ ఒక్క సబ్ స్టేషన్ పునరుద్ధరించాలంటేనే రూ.3 కోట్లు ఖర్చువుతాయి. రహదారులు కొట్టుకుపోయాయి. అనేక మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విపత్తు సాయం పెంచాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (Government Job) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపడంలో ఆలస్యం కావడం వల్లే ఆ ఇద్దరు చనిపోయారని గ్రామస్థులు బాధపడుతున్నారు. రామాయంపేట, సిద్దిపేట మధ్య జాతీయ రహదారికి అనుసంధానించడం వల్ల అది దెబ్బతిని రాకపోకలకు ఆటకంమేర్పడిరది. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని అని డిమాండ్ చేశారు.







