Modi: ఆపరేషన్ సింధూర్ శాలువాతో ప్రధాని మోదీకి సన్మానం

ఆపరేషన్ సింధూర్ డిజైన్‌తో నేసిన శాలువాను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) ప్రధాని మోదీ (Prime Minister Modi ) కి బహూకరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని కలిసి అగ్గిపెట్టె (Matchbox) లో అమిరిన శాలువాను బహూకరించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా దుబ్బాక(Dubbaka)ను ప్రత్యేక హబ్‌గా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ శాలువాను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ (Nalla Vijay) నేశారు. చేనేత మగ్గంపై రెండు గ్రాముల గోల్డ్ జరీతో రెండు మీటర్ల పొడవు, 36 ఇంచుల వెడల్పుతో శాలువాను రూపొందించారు.