Maoists: మావోయిస్టులు కీలక ప్రకటన .. జనవరి 1న
మావోయిస్టులు (Maoists) కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ ( మహారాష్ట్ర` మధ్యప్రదేశ్`ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ (Anant) పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల (Mallojula) , ఆశన్న ( Asanna ) లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలిపారు. అందరూ లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని గతవారం మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.






