Kaleshwaram: కాళేశ్వరం స్కామ్ నుంచి బయటపడేందుకు ఈటల … కేసీఆర్‌తో

సర్జికల్ స్ట్రయిక్స్ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు, అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసినా ఏనాడూ చెప్పుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ (Indira Gandhi) గొప్పతనాన్ని ఆనాడు వాజ్‌పేయీ (Vajpayee) కూడా గుర్తించి, అపర కాళీ అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి, మోదీ (Modi) కి పోలిక ఏంటని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ సయోద్య గురించి కవిత ఇప్పుడు బయటపెడుతున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay)ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించలేదా? బీఆర్‌ఎస్‌తో దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే సంజయ్‌ను తొలగించింది వాస్తవం కాదా? బీజేపీ నేతల ప్యాకేజీల గురించి రాజాసింగే చెబుతున్నారు. రాజాసింగ్ (Raja Singh) మాటలకు ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలి. షామీర్‌పేటలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, హరీశ్‌రావును కలిశారు. ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈటల రాజేందర్, మోదీ పార్టీలో ఉన్నారా? కేసీఆర్ పార్టీలో ఉన్నారా? కాళేశ్వరం స్కామ్ నుంచి బయటపడేందుకు ఈటల, కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారు అని ఆరోపించారు.