Bhatti Vikramarka : అధికారంలో ఉన్న పదేళ్లలో గిరిజనుల గురించి… కేసీఆర్ ఆలోచించారా? : భట్టి

భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. నాగర్ కర్నూల్ (Nagarkurnool ) జిల్లా పోల్కంపల్లి, బొమ్మంపల్లి, పదర్ సబ్ స్టేషన్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడతూ రూ.12 వేల కోట్లతో ఇటీవల నల్లమల్ల డిక్లరేషన్ (Nallamalla Declaration) ప్రకటించామన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో గిరిజనుల గురించి కేసీఆర్ (KCR) ఆలోచించారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండిరగ్ పెట్టిన బకాయిలను క్రమంగా చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగుల (Employees)కు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.8 వేల కోట్లు చెల్లించాం. రాష్ట్రంలో ఇళ్లులేని కుటుంబం ఉండకూడదని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రూ. 5లక్షలకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్నాం అని అన్నారు.