Revanth Reddy: దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

దసరా పండుగను పురస్కరించుకొని స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి గ్రామస్థులు ఘన స్వాగతం (Welcome) పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూల వర్షం కురిపించారు. కొండారెడ్డిపల్లి (Kondareddypalli) లోని ఆంజనేయస్వామి ఆలయం (Anjaneyaswamy Temple) లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులకు ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం దసరా వేడుకల్లో (Dussehra celebrations) భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి కోట మైసమ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన గ్రామస్థులతో కలిసి వెళ్లి జమ్మిచెట్టు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.