Jaipal Reddy : కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి

నెక్లెస్ రోడ్డులోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి (Jaipal Reddy) స్మారకం వద్ద ఆయన వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పలువురు నేతలు నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పారు. కేంద్రం ఆయనకు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌కు మెట్రో (Metro) జైపాల్‌రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు. దేశం మొత్తం మీద నిజాయతీగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ను తెలంగాణ మరువద్దని చెప్పారు.