High Court : తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన

తెలంగాణ హైకోర్టు (High Court)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది (Lawyer) కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది వేణుగోపాలరావు (Venugopal Rao) 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు. గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital )కి తరలించారు. అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు (Doctors) ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి, రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.