Narmala: నర్మాలలో ఆసక్తికర ఘటన

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా (Sircilla district) నర్మాల లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నర్మాల ((Narmala ) లో వరద బాధితుల్ని పరామర్శించి వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay ) కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎదురుపడ్డారు. కేటీఆర్ కాన్వాయ్ వద్దకు రావడంతో బండి సంజయ్ కారు (car) దిగి అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం కేటీఆర్ నర్మాల బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లారు.