తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.750 కోట్లతో
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మలబార్ జెమ్స్ ఈ కంపెనీ ద్వారా రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్ షోరూమ్స్‌ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ షోరూమ్స్‌ను విస్తరించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పరిశ్రమల డైరెక్టర్ డీ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కేపీ పాల్గొన్నారు.






