KTR:కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్థాన్ (Rajasthan )రాజధాని జైపూర్‌లో జరిగే టాక్ జర్నలిజం (Talk journalism )-2025 కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరు కావాలని కేటీఆర్‌కు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు (Journalists), మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్ఠాత్మక సమావేశాలలో ఒకటిగా ఈ కార్యక్రమం పేరొందింది. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తూ, విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో తెచ్చిన మార్పుల దృష్ట్యా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.