High Court: ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌పై హైకోర్టు (High Court) లో విచారణ జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్యాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు (Supreme Court ) సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎప్‌ఐఆర్(FIR) ను క్వాష్ చేయాలని కోరారు.
ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ , తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27కి వాయిదా వేసింది.