KTR: ‘ముఖ్యమంత్రి కేటీఆర్’.. నోరుజారిన మంత్రి జూపల్లిపై కేటీఆర్ సెటైర్

పొరపాటున తనను తెలంగాణ ముఖ్యమంత్రిగా పేర్కొన్న మంత్రి జూల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి.. ‘ముఖ్యమంత్రి కేటీఆర్’ అంటూ నోరు జారారు. ఆ వెంటనే తన పొరపాటు తెలుసుకొని ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ అంటూ సరిదిద్దుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన కేటీఆర్ (KTR) .. ముఖ్యమంత్రి పేరును మరిచిపోయినందుకు త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన మాటలకు కచ్చితంగా నిజం అవుతాయని, అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. కాగా, మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. “నెలకు రూ.6,500 కోట్లను ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేటీఆర్ (KTR) గారు,” అని తడబడి ఆ వెంటనే “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు” అంటూ సర్దుకున్నారు.