KTR : ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది : కేటీఆర్

కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యే (MLA)లకు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. నిందలు, దండాలు, చందాలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు. గద్వాల (Gadwala) నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)) కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. జూన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని, బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.