KTR:ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాత్తం చేస్తున్నారు : కేటీఆర్
పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ (BRS) నిజనిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో జీడిమెట్ల (Jeedimetla)పారిశ్రామికవాడలో కేటీఆర్ పర్యటించి హమాలీలతో మాట్లాడారు. ఆరు నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటికొచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. రూ.5 లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు. రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతాం. ఆషాఢం సేల్ వంటి ఆఫర్ చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగం కావొద్దు. మా ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనిక్కి తీసుకుంటాం. రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ. ఢల్లీికి మూటలు పంపేందుకు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.






