KTR: సీఎం రేవంత్ రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా : కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఢల్లీిలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై ఏదైనా డ్రగ్స్ కేసు (Drug case) నమోదైందా? దానితో నాకు సంబంధమున్న ట్లు ఆధారాలున్నాయా? దమ్ముంటే భయటపెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నా. నేరుగా నా ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సీఎంకు కొత్తకాదు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని కోర్టుకు లాగుతా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నారు.