KTR : సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? : కేటీఆర్

పుష్ప-2(Pushpa 2) సక్సెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేరు మర్చిపోవడమే నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన తప్పా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. సీఎం పేరు మర్చిపోయినంత మాత్రన అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పాటు పెట్టండి. మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దాం. స్కాములు, ఫార్ములా అంటున్నారు అన్నీ చర్చిద్దాం. కేబినెట్ మీటింగ్‌లో కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టండి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.