KTR :ప్రజలు అవస్థలు పడుతుంటే.. మూసీ సుందరీకరణపై సమీక్షలా? కేటీఆర్

వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి పట్టింపులేనట్లుగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. సిరిసిల్ల (Siricilla) లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తుతుంటే, మూసీ (Musi) సుందరీకరణ, ఒలిపింక్స్ క్రీడల (Olympics Games) గురించి సీఎం సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం పని చేయకపోయినా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలి. రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.