KTR: దమ్ముంటే లగచర్ల రా, సీఎం రేవంత్ కు కేటిఆర్ సవాల్…!

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (BRS) పోరాటం తీవ్రతరం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్ గా ఆ పార్టీ అగ్రనేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే కేసీఆర్ కూడా ప్రజల్లోకి రానున్నారు. ఈ మేరకు ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సెన్సేషన్ అయ్యాయి.
రేవంత్ రెడ్డి పదేపదే తమను టార్గెట్ చేయడం అలాగే బిజెపి కూడా తెలంగాణలో బలపడేందుకు తమనే టార్గెట్ చేయడంతో గులాబీ పార్టీ అలర్ట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే అందించాల్సిన పథకాల విషయంలో ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్. తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కోడంగల్ రా అంటూ చాలెంజ్ చేసారు. రేవంత్‌కి దమ్ముంటే లగచర్ల రావాలని డిమాండ్ చేసారు ఆయన.
మీరు రాలేరు.. నేనే కొడంగల్‌కి వస్తా, రేవంత్‌కి దమ్ముంటే పోలీసులతో అడ్డుకోవద్దని డిమాండ్ చేసారు కేటిఆర్. కొడంగల్ వస్తాం, మీ సంగతి ఏంటో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. హామీలిచ్చి మాటతప్పితే నిలదీయాలని పిలుపునిచ్చారు. వందశాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశానని.. నా సవాల్‌కి రేవంత్ నుంచి స్పందన లేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు బీఆర్ఎస్ కూడబెట్టినవే అన్నారు. రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి రైతుబంధు ఇవ్వలేదని.. వానాకాలం రైతుబంధు కూడా రేవంత్ బాకీ పడ్డారని ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా అని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ వాళ్లు దొరకరని ఎకరాకు రూ.17,500 ఇచ్చే వరకు వదిలిపెట్టొద్దన్నారు, తులం బంగారం ఏమైందని మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు.