KTR : తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామరావు ( కేటీఆర్) (KTR )జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచిచ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. వారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మల్లారెడ్డి (Mallareddy), ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి (Lakshma Reddy), మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) పాల్గొన్నారు.