లోక్ సభ ఎన్నికల్లో దేశంతో పాటు.. తెలంగాణలోనూ

లోక్‌సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్‌సభ ఎన్నికలు నిజాయతీగా జరిగాయి. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పని చేయలేదు. మెదక్‌లో రూ.కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్ గెలవలేదు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేస్తాం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతాం. పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతాం. బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లిపోయిందని విమర్శించారు.