Komuravelli Mallanna: వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం

భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా మార్గశిరం చివరి ఆదివారం స్వామివారి కల్యాణం (swamy kalyanam)నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 10:45 గంటలకు మల్లికార్జునుడు(Mallikarjuna), బలిజ మేడలమ్మ (Balija Medalamma) , గొల్ల కేతమ్మల వివాహ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కాశీలోని జంగంవాడి మఠం అధిపతి మల్లికార్జున శివాచార్య వేద పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.