Kishan Reddy :ఈ ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయం: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ (Erragadda Division) బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిమాట్లాడుతూ ఈ ఎన్నికను ఎవరూ కోరుకున్నది కాదని, స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయన్నారు. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ (BRS) , పదేళ్లకుపైగా కాంగ్రెస్ (Congress) పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, జూబ్లీహిల్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, ఎక్కడ చూసినా చెత్తాచెదారంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ కాదని, మజ్లిస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు.