Kishan Reddy : హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది: కిషన్ రెడ్డి

బిహార్ ఎన్నికల్లో మంచి వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy ) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress), ఆర్జేడీ (RJD) కి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. బిహార్‌లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) , తెలంగాణ (Telangana ) లో కాంగ్రెస్ ఎలా గెలిచింది. దొంగ ఓట్లతోనా? తీవ్రమైన నేరాల్లో ఉన్న సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాల్సిందే. గతంలో దీనిపై కాంగ్రెస్ లేఖ రాసింది. ఇప్పుడు మౌనంగా ఉంది అని తెలిపారు.