Kishan Reddy : హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ (Global Center of Millets) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్‌ను కేంద్ర వ్యవసాయశాఖ (Agriculture Department) ఏర్పాటు చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ (Hyderabad) కేంద్రం కీలకం కానుందన్నారు. రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence) కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాట్లు కానున్నట్లు తెలిపారు.