Kishan Reddy: బీసీ రిజర్వేషన్ల వల్ల ఆ పార్టీకే లబ్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీ (BC )లు నష్టపోతారని చెప్పారు. 10 శాతం ఈబీసీ (EBC) రిజర్వేషన్లను ముస్లింలు (Muslims) కూడా పొందుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీ(MIM Party) కే లబ్ధి అన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా? బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీది. రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతుంది. మోదీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ జాబితాలో చేర్చింది. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం అని అన్నారు.