Bhatti :అసెంబ్లీలో ఆమోదించిన.. కేంద్రం ప్రభుత్వం పెండింగ్‌లో

బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపినా కేంద్ర ప్రభుత్వం పెండిరగ్‌లో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధాని (Prime Minister) ని కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ (Revanth) లేఖ రాసినా ఆయన సమయమివ్వలేదని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలని కోరారు. ప్రధాని సమయం ఇస్తే, అఖిలపక్షంతో కలిసి వచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢల్లీిలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బీసీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించేందుకు బీజేపీ ఎందుకు అడ్డుపడుతోందని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. దీనికి కాంగ్రెస్ శ్రేణులతో పాటు అందరూ మద్దతు తెలపాలని కోరారు.