ఖైరతాబాద్ గణేశుడి వద్ద అంగరంగ వైభవంగా.. రుద్ర హోమం

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.