KCR: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) ని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పరామర్శించారు. కాలు జారి కిందపడటంతో గాయపడి సోమాజీగూడ యశోద ఆసుపత్రి (Yashoda Hospital) లో పల్లా చికిత్స పొందుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలతో కలిసి యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), పలువురు బీఆర్‌ఎస్ నేతలు పల్లాను పరామర్శించిన వారిలో ఉన్నారు.