KCR : ఆయన మళ్లీ సీఎం కావాలన్నది ప్రజల ఆకాంక్ష : కేటీఆర్

తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ (KCR) హీరో అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ భవన్ (Telangana Bhavan )లో వేడుకలు నిర్వహించారు. 71 కిలోల భారీ కేక్ (Cake) ను కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ కారణజన్ముడు. ఆయన మళ్లీ సీఎం(CM) కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60 లక్షల గులాబీ దండు, ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.