Mrs. India : మిసెస్ ఇండియా విజేతగా విజయలక్ష్మి

మిసెస్ ఇండియా సీజన్ -5 విజేతగా కవ్వం విజయలక్ష్మి (Kavvam Vijayalakshmi) నిలిచారు. ఢల్లీిలో జరిగిన గ్రాండ్ ఫినాలే (Grand Finale) ఫలితాలను నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్(Hyderabad) ప్రతినిధి గా పోటీల్లో పాల్గొన్న విజయలక్ష్మి అన్ని రౌండ్లలోనూ విజేతగా నిలిచారు. వీఆర్‌పీ ప్రొడక్షన్ డైరెక్టర్ డా. రీతు (Dr. Ritu) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో పుట్టి, వ్యవసాయ రంగం నుంచి పలు సంస్థలను నిర్వహించి, జాతీయ స్థాయిలో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందన్నారు. దీని వెనుక కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉందని పేర్కొన్నారు.