kavitha: ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలి :కవిత
కాళేశ్వరం ప్రాజెక్టు పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) షాకింగ్ కామెంట్స్ చేశారు. కామారెడ్డి (Kamareddy)లో కవిత మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతను వెంటనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజాంసాగర్ టూరిజం, కౌలాస్ కోట ఓ స్పాట్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. మొంథా తుఫానుతో జిల్లాలో పత్తి రైతులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. జుక్కల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిన్నింగ్ మిల్ కోసం జాగృతి పోరాటం చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పేరుతో డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.






