హైదరాబాద్ లో కగూల్ డేటా కేంద్రం
యూకేకు చెందిన గ్లోబల్ డేటా ఎనలిటిక్స ఈఆర్పీ స్పెషలిస్ట్ కన్సుల్టెన్సీ కంపెనీ కగూల్ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్త అభివృద్ధి కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందాలన్న కంపెనీ ప్రణాళికలను కొత్త కార్యాలయం ఏర్పాటు సూచిస్తుందని, 2025 చివరి నాటికి భారత్‌లో తమ సిబ్బంది సంఖ్యను 200కు పెంచాలని చూస్తున్నామని కగైల్ డేటా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా హెడ్ కల్యాణ్ గుప్తా బ్రహ్మండ్లపల్లి తెలిపారు. యూకేలోని కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి ఆన్లైన్లో ప్రారంభోత్సవంలో కగూల్ గ్రూప్ సీఈవో డేలియన్ జేమ్స్ బార్లో మాట్లాడుతూ అపారమైన టాలెంట్ బేస్, అంకితభావం కలిగిన, ఉత్సాహభరితమైన యువ శక్తి ఇక్కడ ఉండడం వల్లే భారత కార్యకలాపాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నామని తెలిపారు. హైసియా అధ్యక్షుడు భరణి కె అరోల్ ఈ సందర్భంగా కగూల్ను అభినందించారు.






