Minister Jupally : బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు : మంత్రి జూపల్లి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను కేంద్రంలో బీజేపీ (BJP) అడ్డుకుంటుంటే, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS) కోర్టుల్లో వ్యతిరేక పిటిషన్లు వేయిస్తూ అడ్డుపడుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆరోపించారు. హైకోర్టు (High Court) వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలను అణగదొక్కేందుకే బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పటికీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తిచేశాం. ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు అభ్యంతరం తెలపని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు అందాక తదుపరి కార్చాచరణ ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.