KA Paul : జూబ్లీహిల్స్ బరిలో ప్రజాశాంతి పార్టీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. తాను పోటీ చేస్తానా, మరెవరైనా పోటీలో ఉంటారా అనేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఢల్లీిలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి, డ్రామాలు చేస్తోందన్నారు. ఆర్ కృష్ణయ్యతో సహా కొందరు బీసీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు.